KMM: కొణిజర్ల మండలం తనికెళ్ల- వి.వెంకటాయపాలెం మార్గమధ్యలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ, కారు ఢీకొన్నాయి. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో, కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. అయితే ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.