మంచిర్యాల: జన్నారం మండలంలోని లోతర్రేలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. లోతరే గ్రామపంచాయతిలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ బోడ శంకర్, ఉపసర్పంచ్ మండాడి, వార్డు మెంబర్లు శుక్రవారం ఉట్నూర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.