KRNL: ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న నిరాహార దీక్ష శుక్రవారం 20వ రోజుకు చేరింది. దీక్షకు ఆటో డ్రైవర్ల యూనియన్ మద్దతు తెలిపింది. ఐదు నియోజకవర్గాలతో కూడిన ఆదోని జిల్లాను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. పశ్చిమ, కర్నూలు ప్రజలు విద్య, వైద్యం, ఉపాధిలో నష్టపోతున్నందున రాజకీయాలకతీతంగా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.