TG: తమ ప్రభుత్వం వచ్చాక పేదలకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కేటాయించే బాధ్యత తీసుకున్నామన్నారు. వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. మధ్యతరగతి వర్గాలకూ ఇళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.