SRPT: సూర్యాపేట మండలం టేకుమట్ల మూసి వాగు బ్రిడ్జిపై, శుక్రవారం ఆగి ఉన్న లారీని మరొక లారీ వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్ర గాయాలైన పలువురిని స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.