MDK: చేగుంట మండలం వడియారం పెద్ద చెరువును జిల్లా అటవీశాఖ అధికారి జోజో సందర్శించారు. వడియారం పెద్ద చెరువులో రెండు మొసళ్ళు ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. మొసళ్ళ విషయంలో రైతులు గ్రామస్తులు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో శుక్రవారం జిల్లా అటవీశాఖ అధికారి జోజో చెరువును పరిశీలించారు. మొసళ్ళు బంధించే చర్యలు చేపడతామని సూచించారు.