NRML: జిల్లాలో శాంతి భద్రతల కోసం డిసెంబర్ 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా పబ్లిక్ మీటింగులు, ర్యాలీ, ధర్నాలు జరపడం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు వంటి నిషేధిత ఆయుధాలు, లౌడ్ స్పీకర్లు, డీజేలు వినియోగించడం నిషేధమని తెలిపారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.