MBNR: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ప్రజలు విసిగిపోయారని బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. భూత్పూర్ మండలం మదిగట్ల గ్రామానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు గురువారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు.