టెక్ దిగ్గజ సంస్థ గూగుల్.. మరిన్ని ఒప్పందాల దిశగా అడుగులు వేస్తోంది. టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం అంశాన్ని సరైన సమయంలో వెల్లడిస్తామని గూగుల్ వెల్లడించింది. కాగా, అక్టోబరులో రిలయన్స్ ఇంటెలిజెన్స్‌తో గూగుల్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికింద 18 నెలల పాటు జియో వినియోగదార్లకు ‘గూగుల్ జెమినై’ తాజా వెర్షన్‌ను ఉచితంగా అందిస్తోంది.