W.G: పాలకొల్లు మండలం పూలపల్లి పరిధిలోని చందపర్రు రోడ్డు లోని జడ్డు గాంధీకి చెందిన శ్రీ జయలక్ష్మి నరసింహ రైస్ మిల్ బాయిలర్ శుక్రవారం తెల్లవారుజామున పేలి పోయింది. భారీ పేలుడు శబ్దానికి బాయిలర్కి సమీపంలోని గోడలు ధ్వంసం అయ్యాయి. పలు మెటీరియల్స్ విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. బాయిలర్ పేలుడుకి గల కారణాలు తెలియాల్సి వుంది.