BHNG: కృషి పట్టుదలతో విద్యార్థుల విద్యపై పట్టు సాధించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు విద్యార్థులకు సూచించారు. ఆలేరులో గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ను పర్యవేక్షించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్య ఇతర అంశాల గురించి వివరించారు.