తమ దేశ అధ్యక్షుడికి ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలకటంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ స్పందించింది. పుతిన్‌కు మోదీ వచ్చి స్వాగతం పలుకుతారని ఊహించలేదని తెలిపింది. భారత్ ఎప్పటికీ తమ వ్యూహాత్మక గొప్ప భాగస్వామి అని పేర్కొంది. ఈ భాగస్వామ్యంపై ఇరు దేశాలు సంతోషంగా ఉన్నాయని చెప్పింది. భారత్‌తో టెక్నాలజీని పంచుకునేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.