NLG: బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. చిట్యాల మండలం,పెద్దకాపర్తికి చెందిన కాంగ్రెస్ నేతలు చేకూరి గణేష్, ఏర్పుల వెంకటేష్, గుత్తా సావిత్రమ్మ, కట్టంగూరు మండలం, ఇస్మాయిల్ పల్లికి చెందిన మాజీ వార్డు మెంబర్ పెంజర్ల నాగరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి గురువారం బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వారికి గులాబీ కండువా కప్పారు.