TG: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాస్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ మేరకు ఏడీ శ్రీనివాస్‌కు సంబంధించి భారీగా ఆస్తులను గుర్తించింది. రాయదుర్గం మైహోం భూజలో ఫ్లాట్, కర్ణాటకలో 11ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపురంలో 11 ఎకరాలు, మహబూబ్ నగర్లో 4ఎకరాలు, నారాయణపేటలో 3 ఎకరాలు ఉన్నట్లు తెలిపింది. సోదాల్లో రూ.5లక్షల నగదు, 1.6కిలోల బంగారం స్వాధీనం చేసుకుంది.