సాంకేతిక సమస్యల కారణంగా దేశంలో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రదయ్యాయి. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్.. బాలయ్య అభిమానులకు క్షమాపణలు చెప్పింది. ‘మేము చాలా ప్రయత్నించాం. కానీ, కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. ప్రేక్షకుల అసౌకర్యానికి క్షమించండి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఓవర్సీస్లో మాత్రం ప్రీమియర్స్ ప్రదర్శితమవుతాయని పేర్కొంది.