HYD: గాంధీ హాస్పిటల్లో సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ మృతదేహానికి మాజీమంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా.. KTR పర్యటనను వీడియో తీస్తుండగా గుండె నొప్పితో కుప్పకూలగా.. చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.