VKB: చౌడాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన టీఎసూటీఎఫ్ మహాసభల్లో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. బి.శేఖర్ అధ్యక్షుడిగా, సిహెచ్. వెంకటేశ్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 20 మంది సభ్యులతో కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. పీఆర్సీ-2023, ఐదు డీఏలు (DA), డీఏ బకాయిలు వంటి పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు.