WNP: జిల్లాలోని పంచాయతీ ఎన్నికలలో పోటీల్లో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన వెంటనే సమావేశం నిర్వహించి వ్యయ నిబంధనలపై అవగాహన కల్పించాలని పరిశీలకులు శ్రీనివాసులు సూచించారు. అభ్యర్థులకు సమావేశం ఏర్పాటు చేసి నియమ నిబంధనలు, వ్యయ పరిమితులు, ఖర్చుల వివరాలు చూపించాల్సిన అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల ఖర్చులు మూడు విడతలుగా పరిశీలించనున్నట్ల తెలిపారు.