RR: షాద్ నగర్ నియోజకవర్గం కంసాన్ పల్లి గ్రామంలో ప్రజలు కొన్ని నెలలుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మాజీ సర్పంచ్ పద్మా నరేందర్ రెడ్డి తన సొంత నిధులు రూ.1 లక్ష 20 వేలు వెచ్చించి బోరు మోటార్‌ను ఇప్పించి నీటి సమస్యను తీర్చారు. తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు.