AP: విశాఖ పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలపై మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులపై పోర్టల్ ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణీత కాలపరిమితిలో ఎంవోయూల అమలుకు వీలుగా చర్యలు తీసుకోనున్నారు. సీఎం, మంత్రివర్గ ఉపసంఘం, సీఎస్ వీటి పర్యవేక్షణ చేయనున్నారు.