KNR: సుల్తానాబాద్ మండలం దేవునిపల్లిలో 11 నెలల పాప హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో నవంబర్ 18న హరీష్ తన పాపను ఆగ్రహంతో నేలకేసి కొట్టి చంపాడు. ప్రమాదవశాత్తు పడిపోయిందని నమ్మించి ఖననం చేయించారు. అయితే భార్య భవానికి వివాహేతర సంబంధంపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.