ATP: జిల్లా ఎస్పీ పీ.జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురంలోని తేజ జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. నాల్గవ పట్టణ ఎస్సై ప్రసాద్, శక్తి టీం సభ్యులు మహిళలు, చిన్నారుల రక్షణ చట్టాలు, బాల్య వివాహ చట్టాలపై వివరించారు. అలాగే, డయల్-100, 112, 1098, 181 నంబర్ల ఉపయోగాలు, శక్తి యాప్ వినియోగం, సైబర్ ఫ్రాడ్స్ గురించి విద్యార్థులకు తెలియజేశారు.