ATP: కనగానపల్లి(M)కు చెందిన మాజీ సింగల్ విండో ప్రెసిడెంట్ ఉజ్జన్న గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కనగానపల్లికి చేరుకున్నారు. దివంగత ఉజ్జన్న పార్థివ దేహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రార్థించారు.