NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు అయిన సాలూర అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. గురువారం SSTబృందం అధికారులు మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. జిల్లాలోకి అక్రమంగా మద్యం, రూ.50 వేలకు మించి నగదు రవాణా రాకుండా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.