AP: అంధుల క్రికెట్ క్రీడాకారులకు CM చంద్రబాబు నగదు ప్రోత్సాహాలు అభినందనీయమని శాప్ ఛైర్మన్ రవినాయుడు కొనియాడారు. కరుణకుమారికి రూ.15 లక్షలు, దీపికకు రూ.10 లక్షలు ప్రకటన చరిత్రాత్మక నిర్ణయమన్నారు. అర్జున అవార్డు గ్రహీత అజయ్‌కు రూ.2.50 లక్షలు బహుమతి ప్రకటించారని తెలిపారు. క్రీడల అభివృద్ధి పట్ల తనకున్న ప్రత్యేక మక్కువను సీఎం చూపించారని చెప్పారు.