దర్శకుడు అశ్విన్ గంగరాజుతో రిషబ్ శెట్టి మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం బంకించంద్ర ఛటోపాధ్యాయ రాసిన ‘ఆనంద్మఠ్’ నవల ఆధారంగా తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘1763-1800 మధ్య బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు చేసిన సాయుధ పోరాటం, తిరుగుబాటు నేపథ్యంలో ఈ మూవీ రాబోతుంది. దీనికి ‘1770’ టైటిల్ ఫిక్స్ చేశారు’ అని సినీవర్గాలు తెలిపాయి.