KMR: 35వ వార్డు పరిధిలో గల దత్తాత్రేయ ఆలయంలో గురువారం దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తాత్రేయుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందించారు.