AP: పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. డయాఫ్రంవాల్ నేటికి 950 మీటర్లు నిర్మాణం జరిగి 75 శాతం పూర్తి చేశామని తెలిపారు. జగన్ ఐదేళ్లలో 2 శాతం పనులు చేస్తే.. తాము తొలి ఏడాదిలోనే 12 శాతం చేశామని వెల్లడించారు. రైట్ కనెక్టివిటీస్ 82 శాతం, లెప్ట్ కనెక్టివిటీస్ 62 శాతం పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు.