SRPT: మునగాల మండలం వెంకట్రారాంపురం గ్రామపంచాయతీ ఉద్యోగి మంద ముత్తయ్య తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అ గ్రామం ఎస్సీ జనరల్ స్థానం కావడంతో, పోటీ చేసేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు రాజీనామాను ఆమోదించడంతో, ఆయన ప్రచారం ప్రారంభించారు.