MNCL: సీఐటీయూ ఐదవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ జన్నారం మండల కార్యదర్శి అంబటి లక్ష్మణ్ కోరారు. గురువారం జన్నారంలో పంచాయతీ కార్మికులతో కలిసి ఆయన మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు మెదక్ పట్టణంలో సీఐటీయూ ఐదవ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని, ఇందులో ఉద్యమ ప్రణాళిక రూపొందిస్తామన్నారు.