ప్రకాశం: వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ను ఎప్పటిలాగే మార్కాపురంలోనే ఇవ్వాలని CITU టాటా మ్యాజిక్, ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ చేపట్టారు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ నంద్యాలకు మార్చడం తగదని, బ్రేక్ చేయించుకోవాల్సినప్పుడల్లా నంద్యాల వెళ్లాలంటే ఇబ్బందుల తలెత్తుతాయని, యధావిధిగా మార్కాపురంలో ఉంచాలని వారు డిమాండ్ చేశారు.