AP: పరకామణి చోరీ కేసులో దొరికింది 9 డాలర్లేనని జగన్ అన్నారు. ‘అందుకు ప్రాయశ్చిత్తంగా రూ.14 కోట్లు విలువైన ప్రాపర్టీలను TTDకి ఇచ్చారు. ఈ దొంగ దొరకగానే కేసు నమోదైంది, ఛార్జ్ షీట్ వేశారు. మెగా లోక్ అదాలత్లో కేసును పరిష్కరించారు. జ్యుడీషియల్ ఎంక్వైరీ అంతా జరిగాక.. మళ్లీ కేసు తెరపైకి తెచ్చారు. కేవలం రాజకీయాల కోసం ఇదంతా చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.