టీ తాగుతూ దమ్ము కొట్టే అలవాటు చాలామందికి ఉంటుంది. ఆ కిక్కే వేరని ఫీలవుతుంటారు. టీలోని కెఫిన్, సిగరెట్లోని నికోటిన్ కలిసి నాడీ వ్యవస్థను స్టిములేట్ చేయడం వల్లే ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ ఇది ఎంత రిలాక్సో.. అంతకంటే ఎక్కువ డేంజర్. ఈ కాంబినేషన్ వల్ల గుండెపోటు, క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఉంటుంది. కావున, టీతో కలిపి సిగరెట్ కాల్చకపోవడమే మంచిది.