సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ విజయం కోసం భారత్ ఈ నెల 6న జరిగే విశాఖ మ్యాచ్ నుంచి ముగ్గురు ప్లేయర్లను తప్పించనుందని తెలుస్తోంది. తొలి 2 వన్డేల్లో చేతులెత్తేసిన జైస్వాల్(18, 22), ప్రసిద్ధ్ కృష్ణ(48/1, 85/2)ను తప్పించనున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. అలాగే ఆల్‌రౌండర్‌గా ఫెయిల్ అయిన సుందర్నూ వదిలేసి జురెల్, నితీష్, తిలక్‌ను తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి.