విశాఖ వేదికగా ఈ నెల 6న భారత్, సౌతాఫ్రికా మూడో వన్డేలో తలపడనున్న సంగతి తెలిసిందే. రాయ్పూర్ వన్డేలో సౌతాఫ్రికా గెలవడంతో సిరీస్ 1-1తో సమం కాగా.. 3 వన్డేల సిరీస్ విశాఖ మ్యాచ్లో గెలిచిన జట్టు సొంతమవుతుంది. దీంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఇరుజట్లు ఇవాళే విశాఖకు చేరుకోనున్నాయి. ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఈ వన్డే సిరీస్ గెలవడం ప్రతిష్ఠాత్మకం.