HYD: పేట్ బషీరాబాద్ PS పరిధి భాగ్యలక్ష్మికాలనీ రోడ్ నం.1లో మార్వాడీ బాలుడు (14) ఆత్మహత్య చేసుకున్నాడు. చింతల్‌లోని ప్రణవ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. చదువు విషయంలో రాజ్ కుమార్ బిష్ణోయ్‌ని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.