AKP: ఈ నెల 5న జరిగే మెగా PTM 3.0కు మండల పాఠశాలల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని MEOలు జాన్ ప్రసాద్, జగ్గారావు తెలిపారు. విద్యార్థుల ప్రగతి, హాజరు, బలహీనతలు, బలపాయాలు తల్లిదండ్రులకు టీచర్లు స్పష్టంగా వివరించాలని అన్నారు. పేరెంట్స్ సమక్షంలో ప్రగతి నివేదికలు విడుదల చేయాలన్నారు. FLN ద్వారా నైపుణ్యాలు మెరుగుపడ్డప్పటికీ వెనుకబడిన చిన్నారులపై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు.