కృష్ణా: దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పామర్రులోని సచివాలయం వద్ద ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిల్స్‌ను ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు.