NRML: బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్మల్ టీఎన్జీవో భవనంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. దివ్యాంగులు తమ అన్ని హక్కులు,రిజర్వేషన్లు,రాయితీ రుణాలు పూర్తిగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. యుడిఐడి కార్డుల జారీ, సౌకర్యవంతమైన కార్యాలయాల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు.