గుంటూరు పట్టణంలో నూతన రోడ్ల నిర్మాణ సమయంలోనే రోడ్ల పక్కన మొక్కలు నాటడానికి వీలుగా రింగ్స్ ఏర్పాటు చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ, మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా పచ్చదనం పెంపుకు మొక్కలను విరివిగా నాటుతామన్నారు.