NLG: హుజూర్నగర్ దివ్యాంగ చిన్నారులలో వైకల్యం అనేది వారి శరీరానికే గాని మనసుకు కాదని ఎంఈవో భూక్య సైదా నాయక్ తెలిపారు. బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పట్టణంలోని భవిత కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. దివ్యాంగులకు వారి నైపుణ్యానికి అనుగుణంగా తర్ఫీదు నివ్వడానికే భవిత కేంద్రాలు ఉన్నాయని అన్నారు.