SDPT: విద్యార్థులు విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకుని పాఠశాలకు, కన్నవారికి గౌరవాన్ని తీసుకురావాలని సిద్దిపేట అర్బన్ మండల విద్యాధికారి రాజ ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక హైస్కూల్లో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన విద్యార్థులు ప్రదర్శించిన వంటకాలను రుచి చూసి, వారిని అభినందించారు.