ప్లేస్‌మెంట్స్‌లో ఐఐటీ కాన్పూర్ నయా రికార్డు నెలకొల్పింది. ప్లేస్‌మెంట్స్ సీజన్ మొదలైన తొలి రోజే 672 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగ ఆఫర్లు అందుకున్నారు. గతేడాది తొలిరోజుతో పోలిస్తే ఇది 16 శాతం అధికం. ఈ విద్యార్థులు యాక్సెంచర్, బ్లాక్ రాక్, శాప్, ఎయిర్ బస్, నవి, క్వాల్కమ్, డ్యూయిష్ బ్యాంక్ వంటి పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు.