TG: రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి KTRకు లేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ ఎంత గొప్ప వ్యక్తి అనేది KTRకు తెలియదని, తన మాటలు వింటే తెలుస్తుందన్నారు. రాష్ట్రం ఇచ్చిన సోనియా, రాహుల్ కుటుంబాన్ని విమర్శిస్తారా? ఈ కుటుంబం తెలంగాణ ఇస్తేనే మీ కుటుంబసభ్యులు సీఎం అయ్యారని గుర్తుచేశారు. తెలంగాణ కల్చర్ మరిచి విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు.