WNP: శ్రీరంగాపురం మండలం కంబాలపురం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశిస్తూ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ కేంద్రాల వద్ద ఓటరు జాబితాను తప్పకుండా ప్రదర్శించాలని సూచించారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని అన్నారు.