AP: తూ.గో జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతు కుటుంబాలతో మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంపై రైతులకు చంద్రబాబు అవగాహన కల్పించారు. ‘మైక్రో న్యూట్రియన్స్ వాడితే మంచి ఫలితాలు వస్తాయి. NTR సీఎంగా ఉన్నప్పుడు మలేసియా నుంచి పామాయిల్ మొక్కలు తీసుకొచ్చాం. పామాయిల్ పంటకు ఎక్కువ నీరు అవసరం’ అని పేర్కొన్నారు.