మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్యతో ఎయిర్‌పోర్టుల్లో చెక్-ఇన్ సిస్టమ్స్ మొరాయించాయి. ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశా, ఎయిరిండియా విమానాలు ఆలస్యం అవుతున్నాయి. వారణాసి, శంషాబాద్ ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. నిన్న రాత్రి సమస్య పరిష్కారమైందని ఎయిరిండియా చెప్పినా.. తిప్పలు మాత్రం తప్పట్లేదు. దీనిపై సంస్థలు ఇంకా స్పందించలేదు.