WGL: ఖానాపురం MPDO కార్యాలయంలో పనిచేస్తున్న Jr. Asst మహిపాల్ సైబర్ మోసానికి గురై రూ. 47 వేలు కోల్పోయాడు. తన సోదరి నంబరు నుంచి “అర్జంట్‌గా డబ్బు పంపు” అంటూ మెసేజ్ రావడంతో పని ఒత్తిడిలో ఉన్న మహిపాల్ ఫోన్‌పే ద్వారా డబ్బు బదిలీ చేశాడు. మళ్లీ డబ్బు అడగ్గా అనుమానం రావడంతో సోదరి, బావను సంప్రదించగా వారు మెసేజ్ పంపలేదని తేలింది. కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు.