MNCL: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాలలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్న ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.