KRNL: కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామంలో వృద్ధ దంపతులు వీరన్న, పార్వతమ్మ ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవించేవారు. అయితే వయస్సు మీద పడటంతో పాటు అనారోగ్యం తోడు కావడంతో వీరన్న నిన్న రాత్రి మృతి చెందాడు. ఆ మరణ వార్తను జీర్ణించుకోలేక భార్య పార్వతమ్మ కూడా బుధవారం ఉదయం మృతి చెందారు. ఎంతో అన్యోయంగా ఉండే దంపతులు గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.